ప్రజాశక్తి - చోడవరం
జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి గురువారం మండలంలోని జుత్తాడ, చోడవరం, లక్కవరంలోని ప్రాథమిక, జెడ్‌పి ఉన్నత పాఠశాలలను సందర్శించారు. జుత్తాడ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం అన్నం, సాంబారును రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. లక్కవరం ఉన్నత పాఠశాలలో నాడు నేడు పనులను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఎంఇఒ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించే లీడ్ శిక్షణా కార్యక్రమానికి సబ్జెక్టు ఉపాధ్యాయులందరూ కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు. నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని, పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఒ వెంకటేశ్వరరావు, ఎంఇఒ శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు సుందర్ సింగ్, సీతబాబు, అమ్మాజీ, లక్ష్మీ శారద, లక్ష్మి, సిఆర్‌పిలు కెవిఎమ్.నాయుడు, వరలక్ష్మి, సుబ్రమణ్యం, రవిశంకర్ పాల్గొన్నారు.










