Sep 20,2023 22:35

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ టిడిపి నగర మహిళా అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి (45) పార్టీ నిరాహార దీక్షలో బుధవారం కుప్పకూలి మృతి చెందారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు నిరసనంగా కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరంలో బుధవారం సాయంత్రం సత్యవతి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను టిడిపి నాయకులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందారు.