మద్దతు తెలుపుతున్న భూపాల్ చౌదరి
ప్రజాశక్తి - ఆదోని
కులవృత్తిని కాపాడాలంటూ నాయీ బ్రాహ్మణులు చేస్తున్న రిలే దీక్షకు టిడిపి నాయకులు సంఘీభావం తెలిపారు. గురువారం టిడిపి ఆదోని ఇన్‌ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టిడిపి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుల వృత్తిని ఇతర మత, కులస్తులు చేయడం వల్ల ఆ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారు ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. మోడరన్ సెలూన్ షాపులను, ఇతర కుల, మతస్తులు నిర్వహిస్తున్న షాపులను విరమించుకోవాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఈరన్న డిమాండ్ చేశారు. టిడిపి నాయకులు బుద్ధారెడ్డి, మల్లికార్జున ఉన్నారు.










