Aug 19,2023 23:53
నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: ఫ్యాఫ్టో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు బాపట్ల జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయం వద్ద శనివారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పదోన్నతి బదిలీ పొందిన ఉపాధ్యాయుల 2 నెలల పెండింగ్‌ జీతాలను వెంటనే చెల్లించాలని, వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని, జీవో నెంబర్‌ 117 నిలుపుదల రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బడుగు శ్రీనివాస్‌, చైర్మన్‌, సురేష్‌, సెక్రటరీ జనరల్‌ నాయకులు సోషలిజం, వినరుకుమార్‌, చాంద్‌బాషా, శ్రీనివాసరావు, సురేష్‌, వెంకటేశ్వరరెడ్డి, అమర్నాథ్‌, సుభాని, పరిశుద్ధరావు, ప్రసాద్‌బాబు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.