Jul 04,2023 20:29

ర్యాలీ నిర్వహిస్తున్న న్యాయవాదులు

ప్రజాశక్తి - ఆదోని
ఆదోనిలో న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా ఆదోని కోర్టు నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ బంగ్లాను ముట్టడించారు. త్రీ టౌన్‌ ఎస్‌ఐ జయశేఖర్‌, కౌతాళం అగ్రికల్చర్‌ అధికారి శేషాద్రిపై, ఇతర కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే వరకు డీఎస్పీ బంగ్లాను వదిలి వెళ్లేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ నరసింహ రాజు మాట్లాడారు. క్రైం నెంబర్‌ 56, 57 కేసులుగా నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో న్యాయవాదులు నిరసన విరమించారు. అంతకుముందు న్యాయవాదులు సిఐ నరసింహ రాజు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సిఐలు విక్రమ్‌ సింహ పార్థసారథి జోక్యం చేసుకొని ఇరువురికి నచ్చ చెప్పారు. బార్‌ అసోసియేషన్‌ నాయకులు అనితా బాయి, సునీత, సావిత్రి, సీనియర్‌ న్యాయవాదులు మన్సూర్‌ అహ్మద్‌, బషీర్‌ అహ్మద్‌, వైఆర్‌.మల్లికార్జున, విరుపాక్షి రెడ్డి, తబ్రేజ్‌, హాజీ, నాగేంద్రయ్య, తిమ్మయ్య, సురేంద్ర, వీరేష్‌, చంద్రయ్య, రాజేంద్ర ప్రసాద్‌, హుస్సేన్‌ సాని, భాస్కర్‌ ఉన్నారు.