పార్వతీపురం: 1-19 ఏళ్ల వయస్సు వారందరికీ నులిపురుగుల నివారణ మందు అందించాలని కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరు కార్యాలయంలో ఈనెల 10న జరగబోయే డీ వార్మింగ్ డే (నులి పురుగులు నివారణ కార్యక్రమం) రెండో విడతకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో 1-2ఏళ్ల గల 19,106 మందికి సగం మాత్ర, 2-19 ఏళ్లు గల 1,71,332 మందికి ఒకమాత్ర చొప్పున పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. నులి పురుగుల నివారణకు మాత్రలు పంపిణీతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. చేతులు కడుగుకొనే విధానాన్ని ప్రచారం చేయాలని వైద్యశాఖాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెసి ఆర్.గోవిందరావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్, డిఆర్‌ఒ జె.వెంకటరావు, డిఎంహెచ్‌ఒ బి.జగన్నాధరావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.










