Jun 22,2023 21:03

ఆర్ట్స్‌ కళాశాల ఎదుట నిరసన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

కడప అర్బన్‌ : డిగ్రీలో సింగిల్‌ సబ్జెక్ట్‌, మేజర్‌ సబ్జెక్టు విధానం రద్దు చేయాలని, త్రీ సబ్జెక్టు విధానం అమలు చేయాలని, స్కూల్‌ ఇంటర్మీడియట్‌ ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భక్తి చేయాలని, పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం కడప ఆర్ట్స్‌ కాలేజ్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్‌ కుమార్‌, నగర అధ్యక్షులు సురేష్‌ నాయక్‌ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభించి 20 రోజులు పూర్తవుతున్న నేటికీ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అధ్యాపక, టీచర్‌ పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలలో అధ్యాపకులు లేక, పాఠ్య పుస్తకాలు ఇవ్వక 23 శాతం ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణులు అయ్యారని చెప్పారు. దీనిని ప్రభుత్వం గుణపాఠం తీసుకుని ఈ విద్యా సంవత్సరంలో సమస్యలు పరిష్కారించాలని కోరారు. ప్రభుత్వం చేయకుండా పరోక్షంగా ప్రైవేట్‌ కళాశాలలో చేరే విధంగా ప్రభుత్వ విధానాలు అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం డిగ్రీలో నూతన మార్కులు తీసుకురావడం మంచి పరిణామం, కానీ ఈ మార్పులు పేద విద్యార్థులకి చదువుకుని విధంగా ఉండాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డిగ్రీలో సింగల్‌ మేజర్‌, మైనర్‌ విధానం తీసుకువచ్చి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పేద విద్యార్థులకు తనకు ఇష్టమైన కోర్స్‌ ని చదువుకునే హక్కు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. కావున ఈ విధానాన్ని రద్దు చేసి త్రీ సబ్జెక్టు విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మన రాష్ట్రంలో ఇప్పటికే పేద, బడుగు, బలహీన వర్గాలు ఉన్నత చదువు చదువుకోవాలని ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలో కొత్త కోర్సులు ఏర్పాటు చేయవలసింది పోయి ఉన్న కోర్సులు ఎత్తివేసి ప్రభుత్వ ఖజానా తగ్గించుకోవడమే లక్ష్యంతో పని చేస్తుందన్నారు. ఈ విధానం అమలు చేస్తే భవిష్యత్తులో పేదవాడు ఉన్నత చదువుకి దూరం అవుతారని పేర్కొన్నారు. కావున తక్షణమే డిగ్రీలో ఈ విధానాలు ఆపాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.