
క్షేత్ర పర్యటన దృశ్యం
ప్రజాశక్తి -కందుకూరు : టిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కందుకూరుకు చెందిన వక్ష శాస్త్ర, జంతు శాస్త్ర విద్యార్థులు శుక్రవారం వెంకటాద్రిపాలెంలోని జిల్లెలమూడి వెంకటేశ్వర్లు కు చెందిన ఆర్గానిక్ ఫార్మింగ్ పంట పొలాల్లో క్షేత్ర పర్యటనకు వెళ్లారు. ఐదు ఎకరాల్లో రసాయనాల వాడకం లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో సాగు అవుతున్న 15 రకాల కూరగాయల పెంపకాన్ని పరిశీలించారు. అనేక మెలకువల్ని వెంకటేశ్వర్లుద్వారా తెలుసుకున్నారు. కళాశాలలో ఆర్గానిక్ ఫామింగ్ ను ప్రకతి వ్యవసాయ పద్ధతుల్లో గత రెండేళ్లుగా విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయిస్తున్నామని కళాశాల వక్ష శాస్త్ర అధ్యాపకులు, డాక్టర్ ఎన్. తిరుపతి స్వామి, శ్రీ బాలు నాయక్ తెలిపారు. జంతు శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఐ. అనూష, శ్రీమతి డి. ఇంద్రజ పాల్గొన్నారు.