డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో శ్రీ కష్ణా కళాశాల విద్యార్థుల ప్రతిభ
ప్రజాశక్తి -తగరపువలస : ఈ నెల 30న ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ ఫస్టియర్ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో స్థానిక శ్రీకష్ణా డిగ్రీ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని కళాశాల చైర్మన్ బి నరసింగరావు, ప్రిన్సిపల్ జె సతీష్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ కె చిట్టిరెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సింహాచలం గురువారం తెలిపారు. సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో బి.గాయత్రి 9.37/10 పాయింట్లు, మరగడ లోహిత 9.33, కుసుమ9.22,హరిత, వెంకటలక్ష్మీ మంచి గ్రేడింగ్ పాయింట్లు సాధించారని తెలిపారు. బీకామ్‌లో ప్రవీణ్ కుమార్ 8.50 గ్రేడింగ్‌తో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. వీరే కాకుండా 9 పాయింట్లకు పైగా ఆరుగురు, 8 పాయింట్లకు పైగా 27 మంది ఉత్తీర్ణతతో యూనివర్సిటీ పరిధిలో 97 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను గురువారం కాలేజీలో చైర్మన్, ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందించారు.










