Jul 13,2023 17:30

పాత కళాశాల భవనాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ,డివైఎఫ్‌ఐ నాయకులు

డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించాలి
: ఎస్‌ఎఫ్‌ఐ,డివైఎఫ్‌ఐ

ప్రజాశక్తి-ఆలూరు

ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు హాత్తిబెళగల్‌ రోడ్డులోని నిధులు లేక అర్ధాతరంగా నిలిచిపోయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ 1987లో ఆలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినా సొంత భవనాలు లేకపోవడంతో ప్రభుత్వ బార్సు హైస్కూల్‌ -2 కొన్ని గదులను డిగ్రీ కళాశాలకు ఇవ్వడంతో ఇక్కడే డిగ్రీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం హత్తిబెలగల్‌ సమీపంలో గతంలో దాతలు స్థలం ఇవ్వడం జరిగిందని, కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించిన నిధులు సరపడక కొంతవరకు భవనాలు ఏర్పాటు చేసి అర్ధాంతరంగా మధ్యలో నిలిపివేయడంతో ఆ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయం అయిందన్నారు. వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి మైన,ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌ ఎస్‌ఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షుడు ధనుంజరు,సహాయ కార్యదర్శి పరేమేష్‌, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.