Jul 26,2023 23:29

ఫలితాలను విడుదల చేస్తున్న వీసీ తదితరులు

ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించిన డిగ్రీ 6వ సెమిస్టర్‌ ఇంటర్‌షిప్‌ పరీక్ష ఫలితాలను విసి పి.రాజశేఖర్‌ బుధవారం విడుదల చేశారు. పరీక్షలకు మొత్తం 24,766 మంది హాజరుకాక 24,657 మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌ నుండి పొందొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏసీ ఆర్‌.ప్రకాష్‌, రెక్టార్‌ పి.వర ప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ బి.కరుణ పాల్గొన్నారు.