
ప్రజాశక్తి- పరవాడ
పరవాడ డిఎస్‌పిగా కూనపురెడ్డి వెంకట సత్యనారాయణ శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దిశా మహిళా పోలిస్ డిఎస్పీగా, జంగారెడ్డి గూడెం ఇన్‌ఛార్జి ఎస్సీ డిపిఐగా పని చేస్తున్న ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ పరవాడ డిఎస్‌పిగా బదిలీ చేసింది. వెంకట సత్యనారాయణ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా, వీరవాసరం మండలం, పేరంపాలెం. విద్యాభ్యాసం అంత వీరవాసరంలోనే జరిగింది. 1991లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైనా ఆయన 15 ఏళ్ల పాటు ఆ బాధ్యతల్లో తూర్పు గోదావరి జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో పని చేశారు. తరువాత సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ పొందారు. అనంతరం డిఎస్‌పిగా ఉద్యోగోన్నతి పొంది కాకినాడ, రాజమహేంద్రవరంలో పని చేశారు. 2020 నవంబర్‌లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దిశా డిఎస్‌పిగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విభజన అనంతరం ఏలూరు, భీమవరం జిల్లాల దిశా డిఎస్‌పిగా బాధ్యత నిర్వహిస్తు జంగారెడ్డిగూడెం ఎస్‌డిపిఐగా కూడా విధులు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో మొత్తం 87 పోక్సో కేసులను దర్యాప్తు చేయడం జరిగింది.