ప్రజాశక్తి-తెనాలి:‹తెనాలి సబ్ డివిజినల్ పోలీస్ అధికారిగా బుధవారం బి.జనార్ధనరావు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పోలీసు శాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా ఆయనను తెనాలికి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన విజయవాడ వెస్ట్ ఏసిపిగా పనిచేస్తూ, తెనాలి డిఎస్‌పిగా వచ్చారు. ఇప్పటి వరకూ ఇక్కడ పనిచేసిన కె.స్రవంతిరారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిసిఎస్ డిఎస్‌పిగా బదిలీ అయ్యారు. 1995 బ్యాచ్‌కు చెందిన జనార్ధనరావు తొలుత ఏలూరులో, తదుపరి సిఐడి, ఎసిబి విభాగాల్లో పనిచేశారు. జనార్ధనరావు తొలుత వైకుంఠపురం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్బంగా పట్టణ ఒన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, రూరల్ సిఐలు కె.చంద్రశేఖరరావు, ఎస్.వెంకట్రావ్, యు.శ్రీనివాసులు, శ్రీనివాసరెడ్డి, పలువురు ఎస్‌ఐలు స్వాగతించారు. డిఎస్‌పి మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని, ముఖ్యంగా గంజాయి విక్రయాలను అరికడతామన్నారు. నేర నియంత్రణలో ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా పోలీసులకు సహకరించాలన్నారు.










