
ప్రజాశక్తి - పాలకొల్లు
స్థానిక క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి విచ్చేసిన డిఎస్‌పిగా ఎంపికైన రావూరి అభిషేక్ కుటుంబానికి ఆలయ పాలకవర్గం గురువారం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికింది. దేవస్థానం ఛైర్మన్ కోరాడ శ్రీనివాస్, ఇఒ యాళ్ల సూర్యనారాయణ, ట్రస్టీలు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. స్వామి వారి ప్రసాదాలు, ఫొటో అందించారు. కార్యక్రమంలో అభిషేక్ తండ్రి చాచా, తల్లి శ్రీదేవి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.