డిఎఫ్‌ఓకు షికారీలు సన్మానం
డిఎఫ్‌ఓకు షికారీలు సన్మానం
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): తిరుమల పాపవినాశనం లో కొత్త దుకాణాలు ఏర్పాటు అనే అంశంతో ఆందోళనకు గురైన షికారులు, స్థానిక దుకాణదారులు జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ రెడ్డికి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. షికారిల ఆవేదనను సమయస్ఫూర్తితో అర్థం చేసుకున్న జిల్లా అటవీశాఖ అధికారి సతీష్ రెడ్డి కొత్త దుకాణాలను పాప వినాశనంలో ఇటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేయబోమని, ప్రస్తుతం ఉన్న దుకాణాలు యధావిధిగా నియమ నిబంధనల ప్రకారం నిర్వహించుకోవాలని షికారీలకు సూచించారు. తమ సమస్యను పరిష్కరించిన సతీష్ రెడ్డిని బుధవారం తిరుపతి కపిలతీర్థం వద్దనున్న జిల్లా అటవీశాఖ కార్యాలయంలో షికారిల నాయకుడు వెల్ మురగన్, కందన్, దుకాణదారులు సన్మానించి కతజ్ఞతలు తెలిపారు.










