Aug 26,2023 23:39

పరీక్షిస్తున్న డిఎం అండ్‌ హెచ్‌ఒ

ప్రజాశక్తి-పాడేరు:మండలంలోని మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు గ్రామాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జమాల్‌ భాషా శనివారం పర్యటించారు. ఇరడా పల్లి సచివాలయం, మినుములురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న డి.సంపాలను సందర్శించి రోగులను పరీక్షించారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని గర్భిణీలకు సూచించారు. మరిగించిన నీరు చల్లార్చి తాగాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.దోమ తెరలు వాడాలన్నారు. ప్రధాన రహదారి నుండి కరకపుట్టు, దొడిపల్లి మీదుగా రోడ్డు మార్గాన్న వెళుతున్న క్రమంలో దొడ్డిపల్లి సమీపాన ఆయన వాహనం బురద(మట్టి రోడ్డు) కూరుకుపోయింది. కొంత దూరం మోటారు సైకిలుపై ప్రయాణించి కాలినడకన నడుచుకుంటూ ఆయా గ్రామాలను సందర్శించారు.