బాధ్యతలు స్వీకరిస్తున్న న్యాయమూర్తి చంద్రమౌళీశ్వరి
ప్రజాశక్తి-గుంటూరు లీగల్:జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డిఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శిగా జి.చంద్రమౌళీశ్వరి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం నుంచి బదిలీపై వచ్చిన ఆమె గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ.అనిత నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు అభినందనలు తెలిపారు.










