కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డిఐపిఆర్‌ఒ చెన్నకేశవరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డిఐపిఆర్‌ఒ)గా కె.చెన్నకేశవరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సమాచార, పౌర సంబంధాల శాఖలో సహాయ ఇంజినీరుగా 1996 ఆగస్టు ఒకటో తేదీన ఉద్యోగ బాధ్యతలు చేరిన ఆయనకు 2006లో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్‌గా ఉద్యోగోన్నతి లభించింది. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నం ప్రాంతీయ సమాచార ఇంజినీర్ కార్యాలయంలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజినీర్‌గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ శ్రీకాకుళం డిఐపిఆర్‌ఒగా ప్రభుత్వం నియమించింది.










