Sep 20,2023 21:25

భూములను పరిశీలిస్తున్న ఆర్‌డిఒ శైలజ

ప్రజాశక్తి - బొబ్బిలిరూరల్‌ : మండలం లోని కృష్ణాపురం, కోమటిపల్లి, పాత బొబ్బిలి రెవెన్యూ గ్రామాలలోని డీ-పట్టా భూములను ఆర్‌డిఒ పి. శేష శైలజ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధన ప్రకారం డీ పట్టా భూములను డి-పట్టాదారుడు సాగులో ఉన్నట్లయినా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 22ఎ జాబితా నుండి డి - పట్టా భూములను తొలగింపులో భాగంగా ఈ పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ డి.రాజేశ్వరరావు, రీ-సర్వే డిప్యూటీ తహశీల్దార్‌ అప్పయ్య, విఆర్‌ఒ తదితరులు పాల్గొన్నారు.