ప్రజాశక్తి - కారంచేదు : మండల పరిధిలోని దగ్గుబాడు గ్రామ సర్పంచి గేరా రవీంద్రనాథ్ ఠాగూర్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి గేరా కోటేశ్వరరావు (70) మంగళవారం రాత్రి మతి చెందారు. కోటేశ్వరరావు గత కొంతకాలంగా అనారోగ్య కారణంతో వైద్య చికిత్స పొందుతున్నారు. వైసిపి పర్చూరు నియోజక వర్గ మాజీ ఇన్‌ఛార్జి రావి రామనాథం బాబు, ఇంకొల్లు వైసిపి నాయకుడు, మాజీ ఎంపిపి భవనం శ్రీనివాసరెడ్డి తదితరులు కోటేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నివాళుర్పించిన వారిలో పర్చూరు మాజీ జడ్‌పిటిసి కొల్లా సుభాష్ బాబు, రాష్ట్ర సంగీతా నత్య అకాడమీ డైరెక్టర్ యద్దనపూడి హరిప్రసాద్, వైసిపి నాయకులు మళ్లీనీడి జగన్నాథం , భవనం రాజగోపాల్ రెడ్డి, దగ్గుబాటి రామకష్ణ ఉన్నారు. కోటేశ్వరరావు అంత్యక్రియలు బుధవారం సాయంత్రం దగ్గుబాడులో నిర్వహించారు.










