Sep 14,2023 19:33

మాట్లాడుతన్న కలెక్టర్‌


మాట్లాడుతన్న కలెక్టర్‌
దగదర్తిలో 'జగనన్నకి చెబుదాం'
దగదర్తి-ప్రజాశక్తి:ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వారి సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం కలెక్టర్‌ జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌, జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1.30 వరకు కలెక్టర్‌ అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను సావధానంగా వింటూ వారికి పరిష్కార మార్గం చూపుతూ అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు.
నిర్ణీత గడువులోగా పరిష్కారం కాకపోతే తనకు తెలియజేయాలని అర్జీదారులకు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజల వద్దకే పాలన నినాదంతో జగన్‌ అన్నకి చెబుదాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. మొత్తం 110 అర్జీలు వచ్చాయన్నారు.కార్యక్రమంలో ఆర్‌డిఒ శీనా నాయక్‌, జెడ్‌పిసిఇఒ చిరంజీవి, డిపిఓ సుస్మిత రెడ్డి, డ్వామా పీడీ వెంకట్రావు, పీడీ
డిఆర్‌డిఎ సాంబశివారెడ్డి, జిల్లా అధికారులు, తహశీల్దార్‌, ఎండిఒ, మండల సర్వేయర్‌, మండల అధికారులు పాల్గొన్నారు.