Jul 24,2023 21:02

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజరురామరాజు

 కడప : జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచి డెయిరీ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్‌ హాలులో కలెక్టర్‌ వి.విజరు రామరాజు, జెసి గణేష్‌ కుమార్‌, కడప నగర కమిషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనాతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పులివెందుల నియోజక వర్గం లోని పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె మండలాల పరిధిలో ఇప్పటి వరకు నిర్వహణలో ఉన్న, విస్తరణ చేపట్టిన గ్రామాలలో పాల ఉత్పత్తి దారుల నుంచి పాల సేకరణ ప్రక్రియపై ఆరా తీశారు. ప్రస్తుతం నిర్వహణలో వెను కబడి ఉన్న సంఘాలను పక్కా గ్రామాలు, మండలాల డెయిరీ సంఘాలకు సమ్మిళితం చేయాలన్నారు. యూనిట్లలో ఒకసారి మిషనరీ ఏర్పాటు చేశాక పాల సేకరణ ఆగకూడదన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎంపిడిఒలు, మెం టర్లు, ఆర్‌ఐసి, ఎపిడిడిసిఎఫ్‌ పూర్తి బాధ్యతతో కార్యాచరణ చేపట్టా లన్నారు. ఇప్పటికే పాల సేకరణ జరుగుతున్న గ్రామాల్లో రిజిస్టర్‌ అయిన పాడి రైతులు క్రమం తప్పకుండా పాలు పోసేలా చర్యలు చేపట్టాలన్నారు. పాల ఉత్పత్తి తక్కువగా ఉన్న గ్రామాల్లో రైతులను ప్రోత్సహించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల నుంచి పశువుల కొనుగోలు, యూనిట్ల ఏర్పా టుకు రుణాలు అందివ్వాలన్నారు. బల్క్‌ మిల్క్‌ యూనిట్ల గ్రౌండింగ్‌ ప్రక్రి యను చేపట్టాలని జిల్లా సహకార అధికారి, పశుసంవర్ధక శాఖ జెడి, డిఆర్‌డిఎ పీడీలను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ ఆనంద్‌నాయక్‌, జిల్లా సహకార అధికారి సుభాషిణి, ఎపిడిడిసీఎఫ్‌ పులివె ందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎల్‌. వెంకటేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్‌ శారదా, ఎంప ిడిఒలు, మెంటర్లు, ఆర్‌ఐసి, ఎపిడిడిసిఎఫ్‌, సిసిసి సిబ్బంది పాల్గొన్నారు.