Apr 24,2023 00:09

ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే నాగిరెడ్డి

ప్రజాశక్తి -గాజువాక : చిన్నగంట్యాడ జాతీయ రహదారిలో తనిష్క గోల్డ్‌ షోరూం మేడపైన ఆధునిక ఎక్విప్‌మెంట్‌ గల డెంటల్‌, స్కిన్‌ కార్నర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గాజువాక నియోజకవర్గం రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మూల స్తంభం అన్నారు. ఈ ప్రాంతంలోని కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం చేయాలని, మున్ముందు ఈ ఆసుపత్రి అత్యున్నత స్థానానికి వెళ్లాలని ఆకాంక్షించారు.
ఆసుపత్రి డాక్టర్‌ ఎ.హనుజా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం ఇన్‌ఛార్జి తిప్పల దేవన్‌రెడ్డి, గాజువాక మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ రాజు, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, ఉరుకుటి చంటి, ఉక్కు కార్మిక నాయకులు మంత్రి రాజశేఖర్‌, బలిరెడ్డి సత్యనారాయణ, మురళీరాజు, స్థానిక నాయకులు వెంకన్నబాబు రాజు, బాలాజీ ఆసుపత్రి యాజమాన్యం ఎం.వెంకటేశ్వరరావు, ఎం.అవినాష్‌, బంధుమిత్రులు పాల్గొన్నారు.