Oct 14,2023 00:16

డెంగ్యూ లక్షణాలతో మహిళ మృతి


డెంగ్యూ లక్షణాలతో మహిళ మృతి

ప్రజాశక్తి -కార్వేటినగరం: డెంగ్యూ లక్షణాలతో మండల పరిధిలోని ఈదువారిపల్లికి చెందిన మహిళ ఉష (37) శుక్రవారం మృతి చెందింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఉషకు డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు కుటుంబీకులు, స్థానికులు తెలిపారు. ఎంతకీ నయం కాకపోవడంతో చెన్నై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలోమృతి చెందినట్లు తెలిపారు.
ఉష కుటుంబానికి డిప్యూటి సిఎం పరామర్శ
ఉష మృతి చెందిన సమాచారం తెలుసుకున్న డిప్యూటి సిఎం నారాయణస్వామి శుక్రవారం ఈదువారిపల్లికి వచ్చారు. ఉష మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట పలువురు నేతలు ఉన్నారు.