ప్రజాశక్తి - యాదమరి
డెంగ్యూ జ్వరాల పట్ల నిర్లక్ష్యం వద్దు అని యదమరి సిహెచ్‌ఓ లక్ష్మీనారాయణ సూచించారు. యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చిన్నంపల్లి గ్రామంలో ఓ వ్యక్తికి డెంగ్యూ జ్వరం రావడంతో గురువారం సిహెచ్‌ఓ లక్ష్మీనారాయణ సబ్ యూనిట్ ఆఫీసర్ పీరు సాహెబ్ చిన్నంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిహెచ్‌ఓ మాట్లాడుతూ జ్వరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్లక్ష్యం తగదన్నారు. జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది మనిషిని ప్రాణాపాయస్థితికి తీసుకెళుతుందని గుర్తు చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలను నివారించాలన్నారు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రైడే పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. సిబ్బందిచే గ్రామం మొత్తం సర్వే నిర్వహించి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ లక్ష్మీపతి, మహిళా ఆరోగ్య కార్యకర్త అపర్ణ శిల్ప, ఆశా కార్యకర్తలు పద్మ, వినాయకమ్మ తదితరులు పాల్గొన్నారు










