Aug 28,2023 22:05

      జీలుగుమిల్లి:అంకన్నగూడెం సచివాలయ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ డెంగీతో సోమవారం మృతిచెందారు. మండల వ్యవసాయాధికారి గంగాధర్‌ తెలిపిన వివరాల ప్రకారం బుట్టాయగూడెం మండలం సీతప్పగూడేనికి చెందిన కె.వినోద్‌(23) మండలంలోని అంకన్నగూడెం సచివాలయంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వినోద్‌ వారంరోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవల పరీక్షలు నిర్వహించగా డెంగీగా నిర్ధారణ అయింది. దీంతోపాటు కామెర్లు కూడా కావడంతో పరిస్థితి విషమించింది. వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యంకోసం విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి మృతిచెందారు. వినోద్‌కు ఇంకా వివాహం కాలేదు. ఆయన మృతితో వ్యవసాయశాఖ, సచివాలయ సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు.