Aug 12,2023 21:05

మృతి చెందిన ధరణి (ఫైల్‌)

ప్రజాశక్తి - కొమరాడ : డెంగీ జ్వరం బారినపడి ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం. కుమ్మరి గుంటకు చెందిన గనేడ ధరణి (11) డెంగీ జ్వరంతో గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లా జిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు. మొదట్లో జ్వరం రావడంతో పార్వతీపురంలో గల ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం ఆరోగ్యం మరింత క్షీణించడంతో శ్రీకాకుళంలోని జిమ్స్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేసినట్లు తెలిపారు. అక్కడ గతికొద్దు రోజులుగా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషచడంతో విద్యార్థిని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు గనేడ హర్నాధరావు దమయంతిల రోదనలు మిన్నంటాయి. ధరణి పాఠశాలలో చురుకుగా ఉంటూ కోలాటం నృత్యంలో చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ధరణి మతితో కుటుంబ సభ్యులపాటు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు కాలువలు సక్రమంగా లేకపోవడంతో విష జ్వరాల బారిన పడుతున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అపారిశుధ్యం తాండవించడం తోనే ప్రజలు రాగాల బారిన పడుతున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.