Aug 20,2022 23:29

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్న మలేరియా ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌

ప్రజాశక్తి -ములగాడ : జీవీఎంసీ 40వ వార్డు పరిధి ఎకెసి కాలనీలో శనివారం మల్కాపురం మలేరియా విభాగం, ఎకెసి కాలనీ - 1 సచివాలయం ఆధ్వర్యాన డెంగీ, మలేరియా, చికున్‌ గునియా తదితర వ్యాధుల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా ఇన్‌స్పెక్టర్‌ డి.రవికుమార్‌ మాట్లాడుతూ, వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తమై తమ గృహాలలోనూ, పరిసరాలలోనూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారమూ డ్రైడే పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మలేరియా విభాగం సూపర్‌వైజర్‌ దుల్లా శ్రీనివాసరావు, సచివాలయం శానిటరీ సెక్రటరీ సత్తిబాబు, సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌, ఆశా కార్యకర్తలు నాగమణి, పావని, మలేరియా విభాగం సిబ్బంది లలితకుమారి, శ్రీదేవి, వాలంటీర్లు పాల్గొన్నారు.