Mar 07,2022 16:42

ఏ నీడా పారాడదు
వెలుతురు లేని చోట.
ఆమె నీడ కాదు-
కల
ఎపుడో నా మనసు
తీసుకున్న సెల్ఫీ.
ఆమె కల కాదు-
వేసవి
కౌగిలి నిండా కన్నీరే.
ఆమె వేసవి కాదు-
ఎంత ఆకాశమైనా
ప్రేమంతా భూమికోసమే.
ఆమె ఆకాశం కాదు-
విఫల ప్రేమ
కాలం కొసన
వేలాడే నరకం.
ఆమె విఫణి ప్రేమ కాదు-
గాయం
ప్రవహించే నది
ఆలాపన.
ఆమె గాయం కాదు-
శిల
తథాగతుని వాగ్ధానం
సౌందర్య శిల్పం.
ఆమె శిల కాదు-
దాహం
బుద్ధి విదేశీ మద్యం.
ఆమె దాహం కాదు-
దేవుని పధఘట్టనల కింద
చిట్ట చివరి వాక్యం
కాదన్నవన్నీ ఆమేనని

భూత వర్తమాన భవిష్యత్తుల్లేని
మతగ్రంధమే ఆమె అని  
ఒక తిరుగులేని శాసనం!?
ఒక ధిక్కారం అవసరమైన చోట
బానిసత్వం స్వేచ్ఛగా వర్ధిల్లితున్న చోట
ఆమె ఎవరు?ఆమె ఏమిటి?
ఆమె ఎక్కడ?.

- శిఖా-ఆకాష్,  9381522247