ప్రజాశక్తి-అన్నవరం అన్నవరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఆసుపత్రిలో సంకల్పం చేయూత హెల్పింగ్ వింగ్స్ సహకారంతో ఆదివారం రక్తదానం శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవస్థానం ఇఒ ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ రక్తహీనత వల్ల ఎందరో రోగులు ఇబ్బంది పడుతున్నారని, ప్రాణాలు కూడా కోల్పోతున్నారని చెప్పారు. అటువంటి వారి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానాన్ని అందించాలన్నారు. శిబిర నిర్వాహకులు జగదీష్ మాట్లాడుతూ వార్షిక బ్రహ్సోత్సవాల్లో తీరిక లేని సమయంలో కూడా శిబిరంలో రక్తదానం చేయడం ఆజాద్ సేవా తత్పరతకు నిదర్శనం అని అన్నారు.










