ప్రజాశక్తి - హోళగుంద
మండలంలోని నెరణికి, కొత్తపేట తండా కొండ గుహలో వెలసిన దేవరగట్టు శ్రీమాలమల్లేశ్వర స్వామి సన్నిధిలో సాగునీటి సంఘం అధ్యక్షులు సమ్మతగేరి తప్పిటి రామారెడ్డి మూడు రోజులుగా వర్షం కోసం వరుణ హోమం నిర్వహించారు. ఆదివారం ముగింపు సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి తమ జీవితాలు బాగుండాలని హోమం చేశారు. వరుణుని అనుగ్రహంతో పాటు శ్రీమాలమల్లేశ్వర స్వామి ఆశీస్సులు కూడా తమపై ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవరగట్టులో భక్తుల రద్దీ
దేవరగట్టులో ఆదివారం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం 6 గంటల నుంచి భక్తుల విరివిగా శ్రీమాల మల్లేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గం భక్తులే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దేవరగట్టు అన్నదాన సత్రంలో భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. దేవరగట్టులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హోమం నిర్వహిస్తున్న నాయకులు










