ప్రజాశక్తి - హోళగుంద
మండలంలోని నెరనికి, నెరనికి తండా, కొత్తపేట కొండ గుహల్లో వెలిసిన శ్రీమాల మల్లేశ్వర సన్నిధిలో సోమవారం దీపావళి అమావాస్య సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి బారులుదీరి పూజలు చేశారు. అర్చకులు స్వామి వార్లకు బిల్వార్చన, కుంకుమార్చన, పూజలు చేశారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.