Oct 19,2023 20:01

విగ్రహమూర్తులను తెస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి - హోళగుంద
మండలంలోని నెరణికి గ్రామంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి, దసరా సందర్భంగా ఈనెల 24న కల్యాణోత్సవం (బన్నీ ఉత్సవం) నిర్వహించేందుకు శ్రీమాలమల్లేశ్వర విగ్రహమూర్తులను దేవరగట్టుకు తీసుకెళ్లి సింహాసన కట్టపై ఆశీనులను చేశారు. దసరా సందర్భంగా 24న కల్యాణోత్సవం (బన్నీ ఉత్సవం), 26న రథోత్సవం, 27న గురవయ్యలాట గొలుసు తెంపుట, సాయంత్రం దేవదాసులో నృత్యాలు, క్రీడలు నిర్వహిస్తారు.
బన్నీ ఉత్సవంపై అవగాహన సదస్సులు
ఇప్పటికే కలెక్టర్‌ డాక్టర్‌ సృజన, ఎస్పీ కృష్ణకాంత్‌ దేవరగట్టును సందర్శించి బన్నీ ఉత్సవాలపై ఆరా తీశారు. భక్తులకు అవగాహన కల్పించారు. తాగునీరు, మురుగుదొడ్లు, లైటింగ్‌ వ్యవస్థ, తదితర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకూడదని సూచించారు. జిల్లా అధికారుల సూచనల మేరకు ఆయా శాఖల అధికారులు ఇప్పటికే దేవరగట్టు బన్నీ ఉత్సవాల ఏర్పాట్లలో నిమగమయ్యారు. ఆదోని డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు, హోళగుంద ఎస్‌ఐ శ్రీనివాస ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన గ్రామాల్లో కార్డెన్‌ సెర్చ్‌, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.