
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం చెడుపై మంచి సాధించిన విజ యంకు మారు పేరుగా ప్రతి ఏటా దసరా నవరాత్రులు జరుపు కుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక దేవిచౌక్‌లో బాలాత్రిపుర సుందరి దేవి ఆలయంలో కుటుంబ సభ్యులుతో కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు సుఖ: సంతోషాలతో ఉండాలని అమ్మవార్లని కోరుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం మంచి అనుభూతిని కల్గించిందని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కలెక్టర్ దంపతులకు స్వాగతం పలికి, అమ్మవారి సన్నిధిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు.