Nov 10,2023 22:09

సాలూరు : నివాళ్లు అర్పిస్తున్న మున్సిపల్‌ కార్మికులు

పార్వతీపురంటౌన్‌: మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేత మన్నం డేవిడ్‌ మృతి ఉద్యమానికి తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిఐటియు కోశాధికారి జి.వెంకటరమణ అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులతో కలిసి డేవిడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్వతీపురం మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షులు బంగారు రవి తల్లి మైనమ్మ మృతి చెందడంతో ఆమె భౌతిక దేహానికి పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులకు ఓదార్చారు. మైనమ్మ మున్సిపల్‌ వర్కర్‌ గా పట్టణ ప్రజలకు మంచి సేవలందించారని అన్నారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు బంకురు సూరిబాబు, నాగవంశం శంకరరావు, చీపురుపల్లి సింహాచలం, మామిడి శివ, బంగారి రాజేష్‌, మంగళగిరి శ్రీను, గంటేడి గంగరాజు, మామిడి మజ్జి, పాపులమ్మ, తదితర మున్సిపల్‌ వర్కర్స్‌ పాల్గొన్నారు.
సాలూరు: మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు మన్నం డేవిడ్‌ సేవలు మరువలేనివని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ మన్యం జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు అన్నారు. యూనియన్‌ నాయకులు టి.శంకర్‌ అద్యక్షతన నిర్వహించిన సభలో డేవిడ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే పార్వతీపురం మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు టి.రవి తల్లి మన్నెమ్మ మృతి కి కూడా సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు టి.వెంకట్రావు, పోలరాజు పాల్గొన్నారు.