Oct 08,2023 23:57

ప్రజశక్తి - చీరాల
వివిధ రంగాల్లో విశేష సేవలందించిన దేవాంగ ప్రతినిధులకు దేవాంగ రత్న బిరుదతో ఘనంగా సత్కరించారు. దేవాంగ సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో దేవాంగ రత్న బిరుద ప్రధాన సభను ఆదివారం నిర్వహించారు. తిరుపతి సత్రం మహాజన సభలో మావూరి వెంకటరమణ, దొంతశెట్టి వెంకట మనోహర్‌, నిమ్మల కృష్ణప్ప, తొగర్ల చిరంజీవి, డాక్టర్‌ సజ్జ లోకేశ్వరరావు, డాక్టర్‌ మంచు కుమారస్వామి, డాక్టర్‌ మెట్ల మధుసూదనరావు, డాక్టర్‌ దొంతంశెట్టి జోగారావు, దొంతంశెట్టి రత్నారెడ్డి, డాక్టర్‌ సత్రం మల్లేశ్వరరావు, నక్కిన త్రినాధ్‌రావులకు దేవాంగరత్న బిరుదు  దయానందపురి మహాస్వామి సమక్షంలో ప్రధానం చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న చీరాల చేనేత నాయకులు సజ్జ వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడారు.తిరుపతిలో దేవాంగ సమాజం కోసం నిర్మించి తలపెట్టిన సంత్రం నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తక్షణ విరాళం ప్రకటించారు.శ్రీశ్రీనివాస ఉమామారలింగేశ్వర నిత్య అన్నదాన దేవాంగం సత్రం  కార్యనిర్వాహక కమిటి, శాశ్విత పాలకవర్గ సభ్యులు అభినందించారు.