Sep 02,2023 20:21

విరాళాలు ఇస్తున్న దాతలు

ప్రజాశక్తి -కందుకూరు :శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం పునర్నిర్మాణం కోసం ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి అంకమ్మ తల్లి భక్తులు కలిసి ప్రతిష్టాత్మకంగా ఈనెల 7వ తేదీన అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం చేపట్టనున్నారు. అందులో భాగంగా దేవాలయం పున: నిర్మాణానికి పువ్వాడి రమణయ్య, భార్య మస్తానమ్మ రూ 25, 116లను, కూనం సుబ్బారెడ్డి భార్య మాధవిలత రూ 26,100ను, అమ్మవారి పాదాల చెంత ఏర్పాటు చేయు సువర్ణ లోకి రెడ్డి అశోక్‌ రెడ్డి భార్య ప్రతూష రూ 6250లను యంత్రం కొరకు అమ్మవారికి భక్తితో కానుకగా సమర్పించారు. సూరం వేణుగోపాల్‌ రెడ్డి , మంచిరాజు మురళి, తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు అందించిన దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు. 7వ తేదీ అంకమ్మ తల్లి పునః ప్రతిష్ట కార్యక్రమమునకు అన్న ప్రసాద వితరణ జరుగునని తెలియజేశారు.