May 01,2023 20:00

విరాళం అందజేస్తున్న దివాకర్‌ రెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
మండలంలోని సూగూరు గ్రామంలో వెలసిన రామలింగేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి రూ.లక్ష విరాళంగా అందజేశారు. సోమవారం రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న తిక్కారెడ్డి తనయుడు, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి చేతులమీదుగా గ్రామ పెద్దలకు నగదును అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, ఆలయ పూజారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో పూజారులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పూజారులు శాలువా, పూలమాల వేసి ఆశీస్సులు అందజేశారు. టిడిపి జిల్లా కార్యదర్శి చావిడి వెంకటేష్‌, బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్‌నాథ్‌ రెడ్డి, సూగూరు భాస్కర్‌ రెడ్డి, పాండురంగ, ఈరన్న, గోపాల్‌, కలుదేవకుంట రాగన్న, లక్ష్మారి రామయ్య, వెంకటరాముడు, ఈరన్న గౌడ్‌, జెట్టి వీరేష్‌, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్‌ రాజు, లక్ష్మారి చిదానంద పాల్గొన్నారు.