
చెక్కును అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి - జగ్గయ్యపేట: దేవాలయాల అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. దానిలో భాగంగా శనివారం ఉదయభాను కషితో శ్రీవాణి ట్రస్టు ద్వారా గౌరవరం గ్రామా దేవాలయానికి మంజూరైన 7 లక్షల రూపాయలు, భీమవరం గ్రామ దేవాలయానికి మంజూరైన 3.33 లక్షల రూపాయల చెక్కులను రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను ఆలయ కమిటీ సభ్యులకు, నాయకులకు అందజేశారు. ఉదయభాను కషితో శ్రీవాణి ట్రస్టు ద్వారా ఒక్కొక్క దేవాలయానికి ఇటీవల కాలంలో 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఇప్పటికే దేవాలయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.