Jul 15,2023 00:27

అడ్డుకుంటున్న గ్రామస్తులు

ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలో ఏఎల్‌పురం మేజర్‌ పంచాయతీ బోయినవారి చెరువులో జరుగుతున్న వెంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణ పనులను శుక్రవారం దేవాదాయశాఖ, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ ఇఒ పైల శేఖర్‌బాబు మాట్లాడుతూ, చెరువు గర్భంలో దేవాలయ నిర్మాణం చేపడితే భవిష్యత్‌లో కూలి పోయి భక్తులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, దీంతో రెవెన్యూ అదికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దేవాలయం నిర్మాణాన్ని అడ్డుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నించడంతో అక్కడి నుంచి అధికారులు వెళ్లి పోయారు.