
ప్రజాశక్తి - గణపవరం
మండలంలో దేవాలయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు రైతు భరోసా కల్పించాలని కౌలు రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ పి.లక్ష్మీకి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం మండల కార్యదర్శి పి.నరశింహమూర్తి మాట్లాడుతూ కౌలు రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. అలాగే బ్యాంకు రుణాలు అందించి, పంటల నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు కె.కిరణ్‌కుమార్, కైగాల శివన్నారాయణ, కౌరు రామచందరావు, ఉత్తర్ల శ్రీనివాసరావు, సత్తీనీడి అన్నవరం పాల్గొన్నారు.