
ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్ విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చి సంక్షేమం, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉందని హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సోమవారం మండలంలోని దొమ్మేరు, పెనకనమెట్ట గ్రామాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు