కడప అర్బన్ ; దేశంలో పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారని పలువురు వక్తలు పేర్కొ న్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో నేషనల్ అసోసి యేషన్ ఆఫ్ జర్నలిస్ట్, ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ పిలుపు మేరకు ఎపిడబ్ల్యూజెఎఫ్ జిల్లా నాయకులు రాజు అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, టిడిపి సీనియర్ నాయకులు లక్ష్మిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర, సంఘ సేవకులు సలావుద్దీన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని దాని జీవనా ధారమైన భావ ప్రకటనా స్వేచ్ఛ, పౌర హక్కులు, ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కడం మోడీ పాలనలో కొత్తేమీ కాదన్నారు. భారత దేశాన్ని హిందుత్వ-ఫాసిస్ట్ నియంతత్వంలోకి వేగంగా లాగడం, దానిని వ్యతిరేకించే వారిని అణిచి వేయడం నిరంతర ఎత్తుగడని తెలిపారు. బిజెపి ప్రభుత్వ విమర్శకులను దేశద్రోహులుగా చిత్రీకరించి జైలుకు పంపడం పరిపాటిగా మారిందని విమర్శించారు. చారిత్రాత్మక రైతాంగ సమ్మెకు మద్దతు ఇచ్చినం దుకు దిశా రవిని అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో స్వేచ్ఛా యుత మీడియా కార్యక లాపాలను లేకుండా చేసేందుకు ఈ విధమైన ఉగ్రవాదానికి తెరలేపారని విమర్శిం చారు. ఇది భారతదేశంలోని మీడియా స్వేచ్ఛ వాస్తవ స్థితిని వెల్లడిస్తుందని పేర్కొన్నారు. నిజాన్ని మాత్రమే ప్రజలకు చేరవేసే మీడియా సంస్థలు, జర్నలి స్టులపై ఇంత పెద్ద ఎత్తున నిరంకుశ దాడి చేయడం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించారు. ప్రజల తరపున ఉద్యమిస్తున్న మీడియాను లక్ష్యంగా చేసుకుని వారిని హింసించటం, అణిచివేసేందుకు చేస్తున్నటువంటి కుట్రకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య భావాలు కలిగిన ఈ దేశపు పౌరులు, దేశభక్తులందరూ ఐక్యంగా ఉద్యమించాలి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ 'న్యూస్ క్లిక్' కార్యాలయం, జర్నలిస్టుల ఇళ్లపై దాడులు చేసి జర్నలిస్టుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమెరాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. సీనియర్ జర్నలిస్టులను కూడా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఫాసిస్టు ఎత్తుగడలను ఎదిరించి మానవ హక్కుల కోసం పోరాడిన అనేక మందిని మోడీ పాలనలో తప్పుడు కేసులు బనాయించి, దేశద్రోహ నేరారోపణలు చేసి జైలుకు పంపారని చెప్పారు. సమావేశంలో టిడిపి నాయకులు మన్నూరు అక్బర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్, అన్వేష్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డాక్టర్ శ్రీనివాసులు, రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు మల్లెల భాస్కర్, లోక్ సత్తా నాయకులు కృష్ణ ప్రసంగించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి, పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులు సిద్దయ్య, నారాయణ, మురళి, నందకుమార్, వనం శర్మ, నాగేందర్‌రెడ్డి, బాషా, వెంకటేష్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఓబులేసు, చంద్రారెడ్డి పాల్గొన్నారు.










