Jul 24,2023 16:06

ఆత్మకూరులో కేజీ రోడ్డుపై ఆందోళన నిర్వహిస్తున్న సిపిఎం కార్యకర్తలు

దేశంలో మహిళలకు రక్షణ లేదు : సిపిఎం

ప్రజాశక్తి - ఆత్మకూర్‌

దేశంలో మహిళలకు రక్షణ లేదని సిపిఎం నాయకులు అన్నారు. మణిపూలో దళిత మహిళాలపై జరిగిన అమానియ అత్యాచారాలను నిరసి స్తూ సోమవారం నాడు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ముందర నల్ల రిబ్బన్లు కట్టుకొని ప్లే కార్డ్స్‌ తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సంద్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్‌, మా బాషలు మాట్లాడుతూ మణిపూర్‌లో ఉన్మాదులు ఆయుధాలు ధరించి దళిత మహిళలను టార్గెట్‌ చేసి బట్టలిప్పమని లేదంటే చంపేస్తామని బెదిరింపులు, గ్యాంగ్‌ రేప్‌లకు పాల్పడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాటిపై మౌనం వ్యక్తం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని పేర్కొన్నారు. వెంటనే ప్రధానమంత్రి మణిపూర్లో జరిగే అల్లర్లపై స్పందించి అత్యాచారానికి పాల్పడిన యువకులపై చర్యలు తీసుకో వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఏ సురేంద్ర,షేక్‌ ఇస్మాయిల్‌, తుమ్మలూరు శివకుమార్‌, గణపతి మహమ్మద్‌ సామేలు శిలార్‌ వీరన్న పుల్లయ్య శ్రీను రాజు హుస్సేన్‌ సాబ్‌ మల్లయ్య రవి రాజు తదితరులు పాల్గొన్నారు. చాగలమర్రి : మణిపూర్‌ ఘటనకు బాధ్యత వహించి ప్రధానమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి, మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఎపి రైతు సంఘం నాయకులు టి రామచంద్రుడు డిమాండ్‌ చేశారు. చాగలమర్రిలో ఎపి రైతు సంఘం నాయకులు టి రామచంద్రుడు, సురేష్‌, ఇఎండి బాషా మాట్లా డుతూ బిజెపి పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని అన్నా రు. ప్రజాస్వామ్యవాదులు మణిపూర్‌ ఘటనను ఖండించాలని అన్నారు.