May 29,2023 23:41

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్‌ దేశంలోనే అతి పెద్ద కార్మిక సంఘం సిఐటియు అని సంఘ: మండల ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు చెప్పారు. స్వాతంత్య్రం రావడానికి 27 ఏళ్లు ముందే కార్మిక సంఘం ఏర్పడిందన్నారు. సిఐటియు వ్యవస్థాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం మాధవపట్నం సెంటర్లో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రసాదరావు మాట్లాడారు. తొలుత సిఐటియు పతాకాన్ని లోవ బాబు ఆవిష్కరించారు. అనంతరం కరణం ప్రసాదరావు మాట్లాడుతూ 1920లో ఏర్పాటైన సిఐటియు సాధించిన కార్మిక విజయాలను వివరించారు. సంఘం ఆధ్వర్యంలో రాబోవు రోజుల్లో కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు బాలం శ్రీనివాస్‌, మాధవపట్నం నాయకులు పాల్గొన్నారు.