![](/sites/default/files/2023-11/IMG-20231116-WA0254_0.jpg)
సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం
ప్రజాశక్తి - భీమవరం
దేశం కన్న మణిపూసల్లో సిపిఎం సీనియర్ నేత ఎన్.శంకరయ్య ఒకరని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం కొనియాడారు. స్థానిక మెంటేవారితోట సిపిఎం జిల్లా కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, సిపిఎం తమిళనాడు రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఎన్.శంకరయ్యకు నివాళి కార్యక్రమం గురువారం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బి.బలరాం, కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్, బి.వాసుదేవరావు, కేతా గోపాలన్ కార్యక్రమంలో పాల్గొని శంకరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బలరాం మాట్లాడుతూ శంకరయ్య భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అగ్రనాయకుల్లో ఒకరని, తమిళనాడులో సిపిఐఎం పార్టీ వ్యవస్థాపకులని తెలిపారు. ఆయన మృతిచెందడం బాధాకరమన్నారు. ఆయనకు విప్లవ జోహార్లు తెలియజేస్తున్నామన్నారు. స్వాతంత్యోద్యమంలో పాల్గొని సంవత్సరాల తరబడి ఆయన జైలు జీవితం గడిపారన్నారు. రైతాంగ ఉద్యమంలో, కార్మికోద్యమంలో పాల్గొన్నారన్నారు. ఆయన నిరాడంబర జీవితం గడిపారన్నారు. తమిళనాడు శాసన సభకు రెండు సార్లు ఎన్నికయ్యారన్నారు. ఆయన సేవలను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం డాక్టరేట్ ప్రకటిస్తే కేంద్రానికి తొత్తులుగా ఉన్న గవర్నర్ దాన్ని ఆమోదించలేదన్నారు. తమిళనాడు రాష్ట్రం ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోందంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన అందించిన సేవలు ఎనలేనవని అన్నారు.