Sep 15,2023 22:59

నరసరావుపేటలో విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పిస్తున్న ఇంజినీర్లు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : దేశం గర్వించదగ్గ ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని రాష్ట్ర ఇంజినీర్స్‌ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి కొమ్మసాని కమలాకర్‌రెడ్డి అన్నారు. ఇంజినీర్స్‌ డే సందర్భంగా నరసరావుపేట పట్టణ లైసెన్సుడ్‌ ఇంజినీర్స్‌ - సర్వేయర్స్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ఇండియన్‌ మెడికల్‌ భవనంలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. తొలుత స్థానిక పురపాలక సంఘం ప్రాంగణంలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూల మాలలేసి నివాళులర్పించారు. కమలాకర్‌రెడ్డి మాట్లాడుతూ 1939లోనే బలమైన ఇంజినీరింగ్‌ వ్యవస్థకు విశ్వేశ్వరయ్య పునాది వేశారన్నారు. దేశ భవిష్యత్తు ఇంజినీర్ల సాంకేతిపై ఆధారపడి ఉంటుందని, ఇందులో యువత నైపుణ్యాలు సాధించాలని సూచించారు. నిత్యం ఆవిష్కరణలు రూపకల్పన చేస్తూ సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. విజరు గ్రూప్‌ కన్సల్ట్‌ ఇంజినీర్‌ ఉన్నం వేణుగోపాల్‌ మాట్లాడుతూ తాగుసాగునీటి ప్రాజెక్టులతో నవభారత నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ శాఖ డిఇ కె.హరనాథ్‌, పట్టణ ప్రణాళికా విభాగపు అధికారి ఎంవి నరసింహా రావు, పట్టణ ప్రణాళికా విభాగపు సూపర్‌వైజర్‌ కెవి సత్యనారాయణ, ఉమ్మడి గుంటూరు జిల్లా ముఖ్య కార్యదర్శి ఆర్‌.సతీష్‌కుమార్‌, ఉపాధ్యక్షులు బి.వెంకట నారాయణ, నరసరావుపేట పట్టణ ఇంజినీర్స్‌ సంఘ ముఖ్య కార్యదర్శి బి.శ్రీనివాససింగ్‌, కోశాధికారి జి.అనిల్‌, గౌరవ అధ్యక్షులు జిపి రంగయ్య , గౌరవ సలహాదారులు ఆర్‌.బ్రహ్మయ్య, జిందాల్‌ పాంథర్‌ స్టీల్‌ పి.కిషోర్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - రెంటచింతల : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి అమలు పరిచిన ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని టైల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు ఎస్‌ఇ వెంకట్‌ రమణ అన్నారు. ప్రాజెక్టు ఆవరణలో విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలు వేశారు. డిఇ నాగరాజు, ఎడిఇ గిరిబాబు, మహమ్మద్‌, ఎఇలు జైపాల్‌, సుజాత, సుబ్బారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఉత్తమ ఉద్యోగిగా అవార్డు పొందిన పంచాయతీరాజ్‌ డిఇ పాశం శ్రీనివాసరెడ్డిని ఎస్సీ ఇ.సుబ్బరాయుడు సత్కరించారు.
ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : కంటెపూడి వరప్రసాద్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో (నలంంద గ్రూప్‌) వేడుకలు నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలను, అత్యుత్తమ సాంకేతికతో ప్రజల కోసం ఆయన నిర్మించిన పలు నిర్మాణాలను గుర్తు చేసుకుని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు టెక్నికల్‌ క్విజ్‌ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సిహెచ్‌. శ్రీనివాసకుమార్‌, డిప్లొమా ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సుబ్రమణ్యం, యుగుందర్‌రెడ్డి, విభాగాధిపతులు పాల్సన్‌, డాక్టర్‌ విజయలక్ష్మిరేఖ, శ్రీనివాసరెడ్డి, సుభాని, ఏవోలు షరీఫ్‌, శివారెడ్డి పాల్గొన్నారు.