చింతకొమ్మదిన్నె : దేశ గొప్ప తనాన్ని తెలుసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు అన్నారు. శనివారం స్థానిక చింతకొమ్మదిన్నె సచివాలయంలో ఆజాద్ కా అమత్ మహోత్సవంలో భాగంగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి ముందుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ అజాద్‌కా అమృత్ మహోత్సవంలో భాగంగా రోజుకు ఒక కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. అనంతరం నా భూమి నాదేశం నేలతల్లికి నమస్కారం చేశారు. సచివాలయ పరిధిలోని శిలాఫలకాన్ని ఆవిష్కరించి భారతదేశం గొప్పతనం గురించి వివరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి, ఎంపిడిఒ రవికుమార్ రెడ్డి, తహశీల్దార్ నారాయణరెడ్డి, నాయకులు కార్పొరేటర్ పాకా సురేష్, వైసిపి కన్వీనర్ గూడా ప్రభాకర్‌రెడ్డి, నాయకులు గుత్తిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి,సుధాకర్ రెడ్డి సురేంద్రారెడ్డి, ఓబుల్ రెడ్డి, స్థానిక పాల్గొన్నారు.










