కలలు రాలి పడున్నాయి.
నిన్నటివి..మొన్నటివి..
కలలుకనేవాడు ఇప్పుడు
వాటి మొకం చూడటం లేదు.
ఒక ఊపిరిపోసే మాట..
ఒక ప్రాణం నిలిపే సాయం..
బతికి మళ్లీ బట్టకడతామనే ఆశని
కలతనిద్రలో కల కనాల్సిన కాలం
కోరలు విచ్చి కూర్చుంటుందని
కలలుకనేవాడు కూడా
అసలు కలగనలేదు..
ప్రతి ఇంట్లో మోగుతున్న చావుడప్పులకి
కలలు పీడకలలై కళ్లు తేలేస్తున్నారు.
కలలు చితుల కాడ క్యూలో
టోకెన్ నెం తీసుకుంటున్నాయి..
నకిలీ కన్నీళ్ల రాజ్యంలో
కలలకి మకిలి అంటుకుంది.
నిషేధిత కలలకాష్టంలోంచి
దేశం కనే కలల్ని గానం చేసేది
దేశదిమ్మరి కవి ఒక్కడే..ఒక్కడే
- పి.శ్రీనివాస్ గౌడ్
99494 29449