Sep 25,2023 21:22

దీన్‌దయాల్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఇంతియాజ్‌

 కడప అర్బన్‌ దేశభక్తిని పెం పొందించుకోవాలని సూ చించిన గొప్ప వ్యక్తి దీన్‌ దయాల్‌ ఉపాద్యారు అని నిహార్‌ స్కిల్‌ ఎడ్యుకేషన్‌ మేన ేజింగ్‌ డైరెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ అన్నారు. సోమవారం దీన్‌ దయాల్‌ జయంతి సందర్బంగా కడపలోని నిహార్‌ స్కిల్‌ ఎడ్యుకేషన్‌లో డీడీయూ జీకేవై పథకంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి ఆయన నివాళి అర్పించారు. దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ పేరుతో నడుస్తున్న ఈ పథకం ద్వారా తమ లాంటి విద్యార్థులు ఎంతో మంది స్కిల్స్‌ నేర్చుకుని ఉద్యోగాలు సాధించారన్నారు. స్వదేశీ ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ద్వా రానే దేశ ఆర్థిక అభివద్ది జరుగుతుందని భావించిన వ్యక్తి అని ఆయనను కొని యాడారు. దీన్‌ దయాల్‌ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సుబ్బరామిరెడ్డి, వారిస్‌ పాల్గొన్నారు.